Friday, 10 July 2015

Rameswaram Temple Information

రామేశ్వరము(Rameswaram) తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉన్నది.తమిళనాడు రాజధాని చెన్నై కి 572 కి.మి దురములొ ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది.

హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువు ని రామసేతువు అని పిలుస్తారు.





రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లొ రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము .


మీరు ముందుగా సముద్ర స్నానం చేసిన తరువాత గుడి లో ఉన్న 22  బావుల్లో స్నానం చేయాలి .. స్నానం చేయడానికి ఒక్కొక్కరికి టికెట్ 25 /- చెల్లించవలసి ఉంటుంది. కాని "Q" చాల పెద్దదిగా ఉంటుంది. ఈ ఫోటో లో చూస్తున్నారు గా మనకోసం బకెట్ లతో వీళ్ళు రెడీ గా ఉంటారు .


 చెప్పను కదా 22  బావుల్లో స్నానం చెయ్యాలని ఆ బావుల పేర్లు ఇవిగో ....
మహాలక్ష్మి తీర్థం, సావిత్రి తీర్థం,గాయత్రి తీర్థము,సరస్వతీ తీర్థము,సేతుమాధవ తీర్థము,నల తీర్థము,నీల తీర్థము,గవయ తీర్థము,కవచ తీర్థము,గందమాదన తీర్థము,చక్ర తీర్థము,శంఖ తీర్థము,బ్రహ్మహత్యాపాతక విమోచన తీర్థము,సూర్య తీర్థము,చంద్ర తీర్థము,గంగా తీర్థము,యమునా తీర్థము,శివ తీర్థము,సర్వ తీర్థము,కోటి తీర్థము ,సత్యామృత తీర్థము,గయా తీర్థము.
 మీరు వెళ్ళినప్పుడు మాత్రం బొట్టింగ్ కి తప్పనిసరిగా వెళ్ళండి . చాల బాగుంటుంది, 50 /- టికెట్ 


.
రామేశ్వరము నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకు పోయినది. ఆ తరువాత రైల్వే లైనును పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుకతిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరము వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు.


పూర్వము కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరములో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతము) మరియు రత్నాకర (హిందూ మహాసముద్రము)ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు. సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతములో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణములో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధము కూడా వచ్చినది.


ఈ ఫోటో  మాత్రం ఆ రోజుల్లో జరిగిన విషాదానికి గుర్తులు . ధనుష్కోడి తన వైభవాన్ని కొలిపోయి .అప్పటి జ్ఞాపకాలను తన వైభవాన్ని మనకు చూపిస్తుంది . 



మార్నింగ్ మళ్లి మేము మిగిలిన ప్లేస్ లు చూడటానికి బయలుదేరాం.మీరు గుడిదగ్గర ఉన్న ఆటో వాళ్ళకు 200 /- ఇస్తే వాళ్ళు శ్రీ రాముడి పాదాలు,ఆంజనేయ స్వామి గుడి, రామ తీర్దం, సీతమ్మ వారి తీర్దం , లక్ష్మణ తీర్దం , కలాం గారి హౌస్ .... చూపిస్తారు .. ఇవాన్ని 2 గంటల సమయం లోపే సరిపోతుంది. మీరు 9 a.m తరవాత వెళ్ళడానికి ప్రయత్నించండి .

ఈ గుడి దగ్గర శ్రీ రాముడు పాదాలు ఉన్నాయి . మనకు గుడిల కనబడుతున్న.. ఇది పర్వతం అంట 
మన ఆంజనేయుడు ఈ ప్లేస్ లోనే రాముల వారికీ సీతమ్మ తల్లి గుర్తులను ఇచ్చాడు .



రామేశ్వరం వెళ్ళడానికి .



No comments:

Post a Comment